పొన్నూరులో భారీ వర్షం

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవటంతో మండలంలో పలు ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షానికి మండలంలో 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తహసిల్దార్ జియావుల్ హక్ మీడియాకు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్