పొన్నూరులో భారీ వర్షం

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో బుధవారం ఎడతెరిపిలేని ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పట్టణ ప్రాంతంతోపాటు మండల పరిధిలో మునిపల్లె, మామిళ్ళపల్లి , పెదపాలెం గ్రామాలలో భారీ వర్షం కురిసింది. పొట్ట దశలో ఉన్న వరి పంటల కు అకాల వర్షాల వల్ల దెబ్బతిని తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్ట పంటకు వర్షం లాభసాటిగా మారింది.

సంబంధిత పోస్ట్