ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారుల తనిఖీలు

చేబ్రోలు మండలంలోని చేబ్రోలు, నారకోడూరు గ్రామాల్లో ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి, తనిఖీ అధికారి పి. ప్రియదర్శిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయో ఉత్పత్తులను పరిశీలించిన అధికారులు సరైన పత్రాలు లేకపోవడంతో ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్–1983 ప్రకారం 939 లీటర్ల, రూ. 2, 78, 911 విలువైన సరుకును నిలిపివేయాలని దుకాణ యాజమానులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు లోబడి ఎరువుల వ్యాపారం చేయాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕