కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలను దృష్టిలో పెట్టుకుని పొన్నూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటి చేస్తున్న కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండి వారి శ్రేయస్సు కోసం నిలబడ తామని, సమస్యల పరిష్కారం కొరకు ప్రాధాన్యం ఇస్తామని ధూళిపాళ్ల హామీ ఇచ్చారు.