పొన్నూరులో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సెయింట్ థామస్ కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఎన్సీసీ విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. 22 ఆంధ్ర బెటాలియన్, తెనాలి ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్‌లో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి ఎంఆర్వో కార్యాలయం మీదుగా సాగిన ఈ ర్యాలీలో, "నషా ముక్త్ భారత్ అభియాన్"లో భాగంగా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కరిముల్లా, స్కూల్ అడ్మినిస్ట్రేటర్ టోనీ, ఎన్సీసీ మాస్టర్ రుద్రపాటి అర్జునరావు పాల్గొన్నారు.