పిచ్చిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు: వైవి సుబ్బారెడ్డి

పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన లంకపోతు పిచ్చి రెడ్డి మరణం పార్టీకి తీరని లోటు అని గుంటూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై వి సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం పొన్నూరు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో కలిసి మామిళ్లపల్లిలోని పిచ్చి రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మిక్కిలి జాన్ తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕