పొన్నూరు: షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి గడ్డివామి దగ్ధం

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం 22వ వార్డులో మంగళవారం విద్యుత్ తీగలు గాలికి అంటుకొని నిప్పురవ్వల పడి షేక్ బాజీకి చెందిన రెండు ఎకరాల గడ్డివామి కి నిప్పు అంటుకుంది. స్థానికులు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. మంటలు గాలికి ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమయానికి స్పందించిన అగ్నిమాపక సిబ్బందిని ప్రజలు అభినందించారు.

సంబంధిత పోస్ట్