పొన్నూరు: ఈనెల 17 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

ఈనెల 17వ తేదీ నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు పొన్నూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొన్నూరు మండలంలో మొత్తం ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 1500 మంది విద్యార్థులు మండల పరిధిలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్