పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు అవ్వారు ఆదెమ్మ తమ ఆస్తులను దానం చేయడం మరువలేనిదని మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక అవ్వారు ఆదెమ్మ వర్ధంతి సందర్భంగా సత్రం ప్రాంగణంలో అనువంశిక దాత అవ్వారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పొన్నూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 50 మంది విద్యార్థులకు రూ. 50 వేలు ఉపకార వేతనాలు అందించారు. ఈవో భవాని ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.