గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెదపాలెం నుండి కాకుమాను మండలం చిన్న కాకుమాను గ్రామం వెళ్లే ప్రధాన రహదారి డ్రైనేజీ కాలవపై ఉన్న వంతెన సగం వరకు పెచ్చు వుడి పెద్దగుంత పడింది. చిన్న కాకుమాను గ్రామానికి వెళ్లాలంటే ఈ రహదారే ప్రధానం. వంతెన పై పడిన గుంతను మరమ్మత్తులు చేయాలని గ్రామ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. రాత్రి వేళ ఈ రహదారి ప్రమాదకరంగా ఉందని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.