గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ కూడలి వద్ద గురువారం ఆర్టీసీ బస్సు యువకుడిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే పొన్నూరు పట్టణం 22వ వార్డుకు చెందిన పండు అంబేద్కర్ సెంటర్లో రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు బాపట్ల ఆర్టీసీ బస్సు ఢీ కొట్టటంతో ఎడమ కాలు విరిగిపోయింది. క్షతగాత్రున్ని ప్రభుత్వ వైద్యశాల కు తరలించి అర్బన్ సీఐ భాస్కర్ కేసు నమోదు చేశారు.