స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో పొన్నూరు మండలం నుంచి సీతారామపురం గ్రామ పంచాయతీ స్వచ్ఛ గ్రామ పంచాయతీ పురస్కారానికి ఎంపికైంది. సెప్టెంబరు 21న ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించిన గ్రామం ఆరోగ్యకర గ్రామంగా జాతీయ పంచాయతీరాజ్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి కేవీవీ సత్యనారాయణ అధికారులను, గ్రామస్థులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుమ్మా చంద్రశేఖరరావు, పంచాయతీ ప్రత్యేక అధికారి డా. ఎన్. ఉషారాణి, పీడీవో నిరంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.