పొన్నూరులో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం, విద్యా సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. బుధవారం, MPDO కార్యాలయంలో నూతనంగా ఎంపికైన నలుగురు అంగన్వాడీ టీచర్లకు నియామక పత్రాలు అందజేశారు. నియోజకవర్గంలోని 2,926 మంది చిన్నారులకు పాఠ్యపుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, 482 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు దుస్తులు పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యలో అంగన్వాడీల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.