పొన్నూరు మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సరికి మూడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మూడు ఏకగ్రీవాలు టిడిపి ఖాతాలోనే పడ్డాయి. 18వ వార్డు నుండి మాలునేని రజిని, 23వ వార్డు నుండి వేజెండ్ల హనుమంతరావు, 35వ వార్డు నుండి షేక్ ఫాతిమాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 37 వార్డులకు 81 మంది పోటీలో ఉన్నారు. చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఐదుగురు మహిళ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 26వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనున్నది. చైర్మన్ పదవి పోటీలో టిడిపి, వైసిపిలతో పాటు కాంగ్రెస్, బిఎస్పీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ కూటమి, వైసిపి అభ్యర్థుల మధ్యనే ఉంటుంది.
,