గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామంలో రావిబట్టివారిపాలెం గ్రామానికి చెందిన వాసిమల్ల ప్రసాద్ రావు అక్రమంగా నిల్వ ఉంచిన 2598 మద్యం సీసాలు, 246 బీరు బాటిల్స్ ను శనివారం గుంటూరు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రసాదరావు పై కేసు నమోదు చేసి త్వరలో కోర్టుకు హాజరు పరుస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.