గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడు గ్రామంలో గురువారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. నూతలపాటి నాగ వేణు (నాని) ఇల్లు తాళాలు పగల కొట్టి బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లడంతో శుక్రవారం రాత్రి రావటంతో గమనించిన ఇంటి యజమాని పెదనందిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ మధు పవన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.