రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో గత 24 గంటల్లో మొత్తం 77.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆర్డీవో శ్రీదేవి సోమవారం తెలిపారు. మండలాల వారీగా భట్టిప్రోలులో అత్యధికంగా 37.6 మి.మీ, కొల్లూరులో 19.6 మి.మీ, వేమూరులో 7.4 మి.మీ, చుండూరులో 5.2 మి.మీ, చెరుకుపల్లిలో 4.2 మి.మీ, అమర్తలూరులో 2.2 మి.మీ, నగరంలో 1.8 మి.మీ వర్షపాతం నమోదైంది. రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో వర్షం నమోదు కాలేదు.