చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద నర్సింగ్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. రేపల్లె ఐఆర్ఈఎఫ్ కాలేజీ చెందిన నర్సింగ్ విద్యార్థులు శనివారం ఉదయం రేపల్లె నుంచి గుంటూరు పరీక్షా కేంద్రానికి వెళ్తున్న సమయంలో గూడవల్లి దగ్గర వారు వెళుతున్న బస్సు షార్ట్ సర్క్యూట్ అవ్వటంతో పూర్తిగా దగ్ధమైనది. బస్సు షార్ట్ సర్క్యూట్ సమయంలో డ్రైవర్ విద్యార్థులని దింపి ఎటువంటి ప్రాణ నష్టము కలగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు.