చెరుకుపల్లి: ఇంటర్ ఫెయిల్ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అవటంతో మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చెరుకుపల్లి మండలంలో జరిగింది. చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామానికి చెందిన ఎం ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కల సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్