రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం పొన్నపల్లిలో జరిగింది. పొన్నపల్లి జాతీయ రహదారి వెంట ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్ వద్ద ఉన్న ఆటో రివర్స్ చేస్తుండగా గుళ్ళపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (36) అనే వ్యక్తి బైక్ పై వెళుతూ ఆటోను ఢీకొట్టాడు. గాయాలతో ఉన్న నాగేశ్వరావు ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.