రేపల్లె నియోజకవర్గంలో 19.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

రేపల్లె నియోజకవర్గంలో మంగళవారం నుండి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షాలకు 19.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెరుకుపల్లి మండలంలో 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 8.4 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 4.2 మిల్లీమీటర్లు, రేపల్లె మండలంలో 4.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. పెంగల్ తుఫాను ప్రభావం తగ్గటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్