బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

రేపల్లెలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన గూడూరు రమేష్ (సాల్మన్‌రాజు)కు తెనాలి పోక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 2022 జూన్ 22న పెయింటింగ్ పనుల నిమిత్తం బాలిక ఇంటికి వెళ్లిన నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో ఈ తీర్పు వెలువడింది. బాధిత బాలికకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్