రేపల్లె: కల్తీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తుల అరెస్టు

కల్తీ మద్యంను తయారు చేస్తున్న పలువురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. రేపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో శనివారం వివరాలు వెల్లడించారు. మొల్లగుంట గ్రామంలో మద్యం తయారు చేస్తున్నారన్న సమాచారంతో గ్రామంలోని మోపిదేవి సతీష్ గృహాన్ని పరిశీలించామన్నారు. అతని ఇంట్లో ఇథనాల్ ఆల్కహాల్ 10 లీటర్లు, 21 కాళీ క్యాన్లు, 510 కాళీ సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్