త్రాగటానికి మంచినీళ్లు ఇవ్వండి అంటూ శుక్రవారం రేపల్లెలో ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. రేపల్లె పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ (జగనన్న కాలనీ)లో వెయ్యి మంది కొత్తగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నప్పటికీ మంచినీరు ఇవ్వటంలో అధికారులు విఫలమయ్యారంటూ సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్ విమర్శించారు. జిల్లా కలెక్టర్ వెంకట మురళి స్పందించి పేద ప్రజలకు తాగేందుకు మంచినీరు ఇప్పించాలని మణిలాల్ కోరారు.