రేపల్లెలో టీడీపీకి చెందిన జమీర్ తాజా చేరికపై చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఆయన పాల్గొన్నారని స్థానికంగా ప్రచారం ఉంది. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరి చంద్రబాబుతో ఫొటో దిగడం చర్చనీయాంశమైంది. పార్టీ కోసం కష్టపడిన పాత కార్యకర్తలను పక్కనపెట్టి కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.