కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావుపై మంగళవారం రేపల్లె పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పీఠ నాగమోహన్ కృష్ణ, పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకర, అవమానకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి, ప్రజలను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.