క్రోసురు మండలం హస్సానాబాదులో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదంలో అన్నను తమ్ముడు కిరాతకంగా చంపాడు. షేక్ మహబూబ్ బాషా(అన్నయ్య) కుటుంబంపై షేక్ అబ్దుల్ బాసిత్ మరో 10 మంది బంధువులతో కలిసి దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిజిహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాషా మృతి చెందారు. ఈ ఘటనలో గురువారం పది మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.