పురుగుల మందు తాగి అన్నదమ్ములు ఆత్మహత్య

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తరచూ మద్యం సేవిస్తున్నారని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన కోటేశ్వరరావు (29), సీతారామయ్య (26) అనే ఇద్దరు అన్నదమ్ములు కూల్ డ్రింక్ లో సోమవారం పురుగుల మందు కలుపుకొని తాగారు. వీరిని కుటుంబ సభ్యులు సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పెద్ద కుమారుడు కోటేశ్వరరావు అర్ధరాత్రి, చిన్న కుమారుడు సీతారామయ్య గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్