ఎస్‌ఐ విచారణ తర్వాత యువతి ఆత్మహత్యాయత్నం?

సత్తెనపల్లిలో గుంటూరు రోడ్ సమీపంలోని పెద్ద కెనాల్ వద్ద బాల అంకమ్మ అనే యువతి ఎలుకల మందు తాగి, చేతిని బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడిఉన్న ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ కేసు విచారణ కోసం పిలిచిన ఎస్‌ఐ తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడిందని యువతి తల్లి ఆరోపించారు. ఈ ఆరోపణలపై అధికారుల స్పందన రావాల్సి ఉంది. ఘట్న పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్