అనుపాలెంలో జోరువాన.. స్తంభించిన జనజీవనం

రాజుపాలెం మండలం అనుపాలెంలో ఆదివారం ఉదయం నుంచి మేఘావృతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వానతో రహదారులపై నీరు నిలిచి జనజీవనం కొంతసేపు స్తంభించింది. ఈ వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ టవర్లు వంటి ఎత్తైన ప్రదేశాల కింద నిలవవద్దని విపత్తుల నిర్వహణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.

సంబంధిత పోస్ట్