సత్తెనపల్లి: రేషన్ షాపులో ఘర్షణ పలువురికి తీవ్ర గాయాలు

సత్తెనపల్లి పట్టణం లోని 23వ వార్డులోని రేషన్ దుకాణంలో సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. రేషన్ తీసుకునే సమయంలో వేలి ముద్రలు వేసే అంశానికి సంబంధించి వాగ్వాధం ప్రారంభమైంది. ఘర్షణకు దారి తీయడంతో అ వార్డుకు చెందిన కరీం, జమీల, కరిష్మా, రెహానా, సాహిదాలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్