సత్తెనపల్లి పట్టణంలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకుంది. గత సంవత్సరం కాలంగా భార్య ఆకుల నవ్య శ్రీ (20)ను విడిచి పెట్టి ఆకుల వాసు (23) తప్పించుకు తిరుగుతున్నాడు. ధ్యానవీణ గాయత్రి అనే హైదరాబాదుకు చెందిన బంధువుల అమ్మాయికి మాయమాటలు చెప్పి సంవత్సరం క్రితం వాసు మరొక పెళ్లి చేసుకుని ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నాడు. సోమవారం వీరి రాకను గమనించి పారిపోతున్న వాసును బంధువులు పట్టుకోగా వారి పై దాడి చేశాడు. అనంతరం ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.