8 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆడుకుందామని బయటకు తీసుకెళ్లిన యువకులు బాలుడిపై దాడి చేశారు. బాలుడు ఏడుస్తుండటాన్ని గమనించిన తల్లికి అసలు విషయం చెప్పాడు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలుడిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕