ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడు గ్రామంలో గురువారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 9సవర్ల బంగారం, కిలో వెండి వస్తువులను ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై ఇంటి యజమాని నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.