ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి.. రాజుపాలెంలో విషాదం

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోట నెమలాపురి రైల్వే బ్రిడ్జి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పేరూపోగు అభిషేక్ అనే యువకుడు మృతి చెందాడు. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల వైపు బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అభిషేక్‌ను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తలకు బలమైన గాయాల కారణంగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ట్రాక్టర్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్