పత్తిలో గులాబీ పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు

గుంటూరు జిల్లా సిరంగిపాలెంలో మంగళవారం జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్‌రావు రైతులకు సూచనలు చేశారు. పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణకు ఎకరానికి 6–8 లింగాకర్షక బుట్టలు, వేపగింజల కషాయం, మందులు వాడాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో మినుము, పెసర వంటి తక్కువ నీటి పంటలు సాగు చేయాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారిణి జే. వాసంతి రైతులు ఫార్మర్‌ ఐడీ నమోదు చేసుకోవాలని, ఈ-క్రాప్ బుకింగ్, ఈ-కేవైసీ పూర్తి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕