ఫిరంగిపురం కార్మెల్ మాత ఉత్సవాలకు ఏర్పాటు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏటా జులై 14, 15, 16 తేదీల్లో మూడు రోజులు పాటు సాగే ఈ ఉత్సవాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇప్పటికే ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. భక్తులు మెట్ల మార్గం ద్వారా కొండ పైకి వెళ్లి మాతను దర్శించుకుని. కొబ్బరి కాయలు, కొవ్వొత్తులు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.