తుళ్లూరు మండలం తుళ్లూరు గ్రామ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని కారు, మరో కారును ఢీకొట్టి వెళ్లిపోయిందని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.