గుంటూరు జిల్లా నూజెండ్లలో సవతి తల్లి దారుణానికి ఒడిగట్టింది. ఆహారంలో ఎలుకల మందు కలిపి ఇద్దరు చిన్నారులను పొట్టనబెట్టుకుంది. ఆహారం కలుషితం కావడంతోనే పిల్లలు మరణించారని పోలీసులను నమ్మించేందుకు సవతి తల్లి ప్రయత్నించింది. అనుమానం వచ్చిన పోలీసులు జరిపిన లోతైన విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితురాలి ఇంట్లో సోదాలు చేయగా ఎలుకల మందు లభించడంతో, ఆమె నేరాన్ని అంగీకరించింది. పోలీసులు నిందితురాలిని గురువారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.