స్తంభాన్ని ఢీకొట్టిన బైక్

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చివలూరు గ్రామం వద్ద కొల్లిపర నందివెలుగు రోడ్డులో రాఘవులు, బసవపున్నయ్యలు బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని గ్రామస్థులు 108కు సమాచారం అందించడంతో, 108 సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕