రోడ్డుపై నిద్రిస్తున్న వృద్ధుడిని ఢీకొట్టిన కారు.. మృతి

తెనాలిలోని మారీస్పేట రైల్వే ఫ్లైఓవర్ అండర్‌పాస్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నిద్రిస్తున్న గుర్తుతెలియని 60-65 ఏళ్ల వృద్ధుడిని ఓ గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు తెనాలి త్రీటౌన్ పోలీసులను సంప్రదించాలని సీఐ సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్