గుంటూరు జిల్లాలో రూ.527 కోట్లతో పట్టణాభివృద్ధి పనులకు శంకుస్థాపన

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా గుంటూరు జిల్లాలో రూ. 527 కోట్లతో పట్టణాభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్ గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC)కు రూ. 205 కోట్లు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్కు రూ. 250 కోట్లు, తెనాలికి రూ. 44 కోట్లు, పొన్నూరుకు రూ. 28 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕