తక్కువ ధరకు బంగారం పేరుతో రూ.5 లక్షలు మోసం

తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి, రూ.5 లక్షలు తీసుకుని ఓ ముఠా మోసానికి పాల్పడింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రైవేటు ఉద్యోగి మురళీకృష్ణకు భద్రాచలంలో స్నేహితుడి ద్వారా ఓ ముఠా పరిచయమైంది. అంగలకుదురు వద్ద చిన్న బంగారం ముక్క ఇచ్చి పరీక్ష చేయించుకోమని చెప్పగా, అది అసలు బంగారం అని తేలింది. దీంతో నమ్మిన మురళీకృష్ణ, ఈ నెల 23న రూ.5 లక్షలు ఇచ్చి 100 గ్రాముల వస్తువులు తీసుకున్నారు. డబ్బు తీసుకున్న తర్వాత అవి రోల్డ్‌గోల్డ్‌ అని తేలడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. రూరల్‌ ఎస్‌ఐ కె. ఆనంద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్