మోదుకూరు–నిడుబ్రోలు రైల్వే స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తున్నప్పుడు జారిపడి సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెనాలి రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, అతన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.