కొల్లిపర మండలంలోని అత్తోట గ్రామంలో మంగళవారం ఉదయం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లను స్వయంగా అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.