తెనాలిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారు జామున నుంచి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులు వీయడంతో చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. తెల్లవారు జాము నుంచి అనేక ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలులకు తోడు భారీ వర్షం కురవడంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది.