తెనాలిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

తెనాలి కటేవరం బీసీ కాలనీ రోడ్డు పక్కన ఆదివారం 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు టీషర్టు, ప్యాంటు ధరించి ఉన్నాడు. వీఆర్వో అనీశ్ ఫిర్యాదుతో తెనాలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్