అంగన్వాడి కేంద్రాల్లోని పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను భోదించాలని అమృతలూరు, మోపర్రు సెక్టార్ సూపర్వైజర్లు నాంచారమ్మ, విజయలక్ష్మిలు సూచించారు. శనివారం వారు అంగన్వాడి కేంద్రాలను సందర్శించి, పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అనంతరం అమృతలూరులో పోషక విలువల ప్రాముఖ్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు.