భారత పౌరులుగా మనమందరం రాజ్యాంగ దినోత్సవాన్ని బాధ్యతగా జరుపుకోవడం మన అదృష్టం అని విశ్రాంత కస్టమ్స్, జీఎస్టీ, అడ్మినిస్ట్రేటివ్ అధికారి, దేవరపల్లి శివరాం ప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరు తూర్పు దళితవాడలో మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుక అంబేద్కర్ యూత్ గౌరవాధ్యక్షులు, కంభం గిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.