కొల్లూరులో ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో జీవధ్వజస్తంభం ప్రతిష్ట

వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో సోమవారం శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో నూతన జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. చెరువు సుబ్రహ్మణ్యం, శ్యామలా దేవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, నూతన జీవ ధ్వజ స్తంభ ప్రతిష్టను తిలకించి, అనంతరం ఆలయంలో పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్